: సోషల్ మీడియా విమర్శలపై శివాలెత్తిన స్టువర్ట్ బిన్నీ భార్య


టీమిండియా క్రికెటర్ స్టువర్ట్ బిన్ని వైఫల్యంతో తనపై వెల్లువెత్తుతున్న విమర్శలకు అతని భార్య మయంతి లంగర్ ఘాటు సమాధానం చెప్పింది. వెస్టిండీస్ తో అమెరికాలో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో స్టువర్ట్ బిన్నీ వేసిన ఓవర్ లో విండీస్ బ్యాట్స్ మన్ ఐదు సిక్సర్లు బాదిన సంగతి తెలిసిందే. ఒక వైడ్, సింగిల్ సహా ఈ ఓవర్లో బిన్నీ మొత్తం 32 పరుగులిచ్చాడు. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ విమర్శల్లో బిన్నీని లక్ష్యం చేసుకోవాల్సిన అభిమానులు చిత్రంగా అతని భార్య మయంతి లంగర్ ను లక్ష్యం చేసుకున్నారు. దీంతో స్టార్ స్పోర్ట్స్ లో క్రికెట్ యాంకర్ అయిన మయంతి లంగర్ మండిపడుతోంది. 'ఆత్మహత్య చేసుకొమ్మని కొంత మంది నాకు సలహా ఇస్తున్నారు. మరి కొందరు విడాకులు తీసుకొమ్మని సలహా ఇస్తున్నారు. ఇలాంటి వారంతా తమ జీవితాల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలి' అని సూచించింది. మొత్తానికి తమను విమర్శించడంలో చాలా మందికి ఆనందం లభిస్తున్నట్టుందని ఆమె ఎద్దేవా చేసింది. ఇంకొందరు అభిమానులు డబ్బు కోసం బిన్నీని వివాహం చేసుకున్నానని ఆరోపిస్తున్నారని, తాను 18 ఏళ్ల వయసు నుంచే సంపాదించడం మొదలు పెట్టానని, డబ్బు కోసం వివాహం చేసుకోవాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేసింది. తమ సంపాదన గురించి బుర్రపాడు చేసుకోకుండా మీ సంపాద గురించి మీరు చూసుకోండని ఆమె హితవు పలికింది.

  • Loading...

More Telugu News