: ఏ తప్పూ చేయకపోతే... స్టే ఎందుకు తెచ్చుకున్నారు?: చంద్రబాబును నిలదీసిన సి.రామచంద్రయ్య!


ఓటుకు నోటు కేసులో పునర్విచారణను నిలుపుదల చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన వెంటనే టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుపై అన్ని వైపుల నుంచి ఎదురుదాడి మొదలైంది. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితం కడపలో మీడియా ముందుకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఏపీ శాసనమండలిలో ఆ పార్టీ నేత సి.రామచంద్రయ్య... చంద్రబాబుపై ప్రశ్నాస్త్రాలు సంధించారు. ఓటుకు నోటు కేసులో ఏ తప్పు చేయకపోతే... సీఎం చంద్రబాబు స్టే కోసం హైకోర్టుకు ఎందుకెళ్లారని ఆయన ప్రశ్నించారు. ఈ కేసులో కీలకంగా మారిన ఆడియో టేపుల్లో గొంతు తనది కాదని చంద్రబాబు ఏనాడూ చెప్పలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కేసులో ఇద్దరు సీఎంలు చంద్రబాబు, కేసీఆర్ ల మధ్య రాజీ కుదిర్చే భవన్ గా రాజ్ భవన్ మారిందని ఆయన ఆరోపించారు. ఇద్దరు సీఎంలు రాజీపడి ఏసీబీ విచారణను నిలుపుదల చేయించారని ఆయన మండిపడ్డారు.

  • Loading...

More Telugu News