: సారీ, 4న రాలేను... 6న అయితే వస్తా!: నోటీసులపై సీఐడీకి భూమన సమాధానం!


తుని విధ్వంసం కేసులో విచారణకు హాజరుకావాలన్న ఏపీ సీఐడీ నోటీసులకు వైసీపీ కీలక నేత, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి వెనువెంటనే స్పందించారు. నేటి ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో ఉన్న ఆయనకు సీఐడీ అధికారులు నోటీసులు అందజేశారు. అక్కడే సదరు నోటీసులను విప్పి చూసిన భూమన... ఈ నెల 4న గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సి ఉన్నట్లు గుర్తించారు. వెనువెంటనే స్పందించిన భూమన... ఈ నెల 4న గుంటూరు రావడం కుదరదని సీఐడీ అధికారులకు ముఖం మీదే చెప్పేశారు. ఈ నెల 6న అయితే రావడానికి యత్నిస్తానని ఆయన చెప్పారు. దీంతో చేసేదేమీ లేక సీఐడీ అధికారులు నోటీసులు అందజేసి వెళ్లిపోయారు.

  • Loading...

More Telugu News