: ‘హోదా’ కోసం రోడ్డెక్కిన జనసేన!... తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద కార్యకర్తల ధర్నా!


ఏపీకి ప్రత్యేక హోదా కోసం టాలీవుడ్ అగ్రనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అందరి కంటే కాస్తంత ఆలస్యంగా గళం విప్పితే... ఆయన బాటలోనే జనసేన పార్టీ కార్యకర్తలు నడుస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తూ వారు కొద్దిసేపటి క్రితం విజయవాడలో ధర్నాకు దిగారు. నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ధర్నాకు దిగిన జనసేన కార్యకర్తలు... ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాల్సిందేనని పెద్ద పెట్టున నినాదాలు చేస్తున్నారు. ఒక్కసారిగా జనసేన కార్యకర్తలు అక్కడ ప్రత్యక్షం కావడం, ప్రత్యేక హోదా నినాదాలు వినిపించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

  • Loading...

More Telugu News