: జీఎస్టీకి ఓకే చెప్పిన ఒడిశా!... రాష్ట్రపతి ఆమోదం ఇక లాంఛనమే!


సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న ‘గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ)’ బిల్లు చట్టంగా మారడం ఇక లాంఛనమే. ఇప్పటికే పార్లమెంటులో ఆమోదం పొందిన ఈ బిల్లుకు దేశంలోని సగం రాష్ట్రాలకు పైగా ఆమోద ముద్ర వేశాయి. రాష్ట్రపతి ఆమోదం లభించాలంటే సదరు బిల్లుకు కనీసం 16 రాష్ట్రాల మద్దతు అవసరమైంది. మొన్న (బుధవారానికి) 15 రాష్ట్రాలు ఈ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా... నిన్న ఒడిశా కూడా తన మద్దతును తెలిపింది. దీంతో బిల్లుకు అవసరమైన కనీస రాష్ట్రాల మద్దతు లభించినట్లైంది. దీంతో ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లాంఛనప్రాయమే. నేడో, రేపో కేంద్రం ఈ బిల్లును రాష్ట్రపతి భవన్ కు పంపనుంది. రాష్ట్రపతి ఆమోదం లభించిన వెంటనే ఈ బిల్లు చట్టంగా మారుతుంది.

  • Loading...

More Telugu News