: సచిన్ ఇచ్చిన కారును నాన్నకు బహుమతిగా ఇచ్చేస్తా: సాక్షి మాలిక్


క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తనకు బహుమతిగా ఇచ్చిన కారును తన తండ్రికి కానుకగా ఇచ్చేస్తానని రియో ఒలింపిక్స్ లో కాంస్య పతక విజేత రెజ్లర్ సాక్షి మాలిక్ చెప్పింది. ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తన తండ్రి తన కోసం ఎన్నో త్యాగాలు చేశారని, అందుకే, సచిన్ చేతుల మీదుగా అందుకున్న ఆ కారును నాన్నకు కానుకగా ఇచ్చేస్తానని సంతోషంగా చెప్పింది. కామన్ వెల్త్ గేమ్స్ లో పతకం సాధించినందుకు తన తండ్రి బహుమతిగా ఇచ్చిన కారును ప్రస్తుతం తాను వాడుతున్నానని సాక్షి మాలిక్ చెప్పింది.

  • Loading...

More Telugu News