: బాలీవుడ్ హీరోయిన్లంతా ఆ ఊరి కోడళ్లేనట ... రేషన్ కూడా ఇచ్చేస్తున్నాడు!


బాలీవుడ్ హీరోయిన్లేంటి? ఒకేఊరి కోడళ్లేంటి? అని ఆశ్చర్యపోతున్నారా? అయితే మీరు ఉత్తరప్రదేశ్ లోని చందౌలీ జిల్లాలోని సాహేబ్ గంజ్ గ్రామానికి వెళ్లాల్సిందే. ఎందుకంటే, ఆ ఊరికే బాలీవుడ్ నటీమణులంతా కోడళ్లుగా వెళ్లారు. సాధారణంగా సినీ నటుల ఫోటోలను బార్బర్ షాపుల వాళ్లే బాగా వాడుకుంటారు. వారిని స్పూర్తిగా తీసుకున్నాడేమో కానీ ఈ గ్రామంలో రేషన్ షాపు ఓనర్ హీరోయిన్లందరి ఫోటోలు వాడేశాడు. బాలీవుడ్ హీరోయిన్లంతా తమ గ్రామానికి చెందిన యువకులను వివాహం చేసుకుని కోడళ్లుగా కాపురానికి వచ్చారని, వారి తలసరి ఆదాయం కేవలం 11 వేల రూపాయలేనని ఆయా తారల పేర్లతో దొంగ రేషన్ కార్డులు సృష్టించాడు. ఆయా తారల పేరిట తమ చౌక ధరల దుకాణం నుంచి రేషన్ కూడా ఇచ్చేస్తున్నాడు. ఈ విషయం కాస్తా ఇప్పుడు జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్ళడంతో విచారణకు ఆదేశించారు. ప్రాధమిక విచారణలో బాలీవుడ్ హీరోయిన్ల పేర్లు, ఫోటోలతో దొంగ రేషన్ కార్డులు తయారు చేసి, వాటితో రేషన్ కొల్లగొడుతున్నట్టు నిర్ధారణ అయింది.

  • Loading...

More Telugu News