: నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల ఆందోళనను సర్కార్ పట్టించుకోవడం లేదు: భట్టీవిక్రమార్క
నిజాం షుగర్ ఫ్యాక్టరీకి పూర్వ వైభవం తీసుకొస్తామని నిజామాబాద్ ఎంపీ కవిత చెప్పిన కొద్ది సేపటికే రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టీవిక్రమార్క ఆ ఫ్యాక్టరీ ఎదుర్కొంటున్న సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాదులోని గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈరోజు ఆయన మాట్లాడుతూ.. ఫ్యాక్టరీ కార్మికుల ఆందోళనను తెలంగాణ సర్కార్ పట్టించుకోవడం లేదని అన్నారు. సింగరేణి సంస్థను, దానిలో పనిచేస్తోన్న కార్మికులను కూడా కాపాడుకోవాలని భట్టీవిక్రమార్క ప్రభుత్వానికి సూచించారు. డిపెండెంట్ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇస్తామని సర్కారు గతంలో హామీలు గుప్పించిందని, ఇంతవరకు వారికి ఉద్యోగాలు ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. ఒప్పంద ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు.