: పెరగనున్న ఓబీసీ క్రిమిలేయర్ పరిమితి... రూ. 8 లక్షలకు పెంచే యోచనలో మోదీ సర్కారు!
ఇతర వెనుకబడిన కులాల్లోని సంపన్న శ్రేణిని నిర్థారించే విధానాన్ని ఈ సంవత్సరం డిసెంబర్ లోగా సమీక్షించాలని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు నిర్ణయించింది. ఈ విషయాన్ని సామాజిక న్యాయ సాధికారత శాఖ మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ వెల్లడించారు. ఈ ఏడాదిలోగా క్రిమిలేయర్ నిర్వచనాన్ని సమీక్షిస్తామని ఆయన అన్నారు. కాగా, ప్రస్తుతం ఏడాదికి రూ. 6 లక్షలకు మించి ఆదాయం సంపాదిస్తున్న ఓబీసీలకు రిజర్వేషన్లు వర్తించడం లేదు. వీరిని సంపన్న వర్గంగా పరిగణిస్తుండగా, మారిన పరిస్థితులు, జీవన విధానం నేపథ్యంలో, ఈ పరిమితిని రూ. 8 లక్షలకు పెంచాలని కేంద్రం భావిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.