: రిలయన్స్ జియో అందిస్తున్న ప్యాకేజీల రేట్లు, వాటిల్లో అందే డేటా పూర్తి వివరాలు


రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశంలో రిలయన్స్ జియో 4జీ సేవల గురించి ముఖేష్ అంబానీ సుదీర్ఘ ప్రసంగాన్నే చేశారు. తామందించే పలు రకాల 4జీ సేవలను గురించి ప్రకటించారు. గతంలో ఎన్నడూ లేనంత తక్కువ ధరలకు డేటా ఆఫర్లు ఇస్తూ, వాయిస్ కాల్స్ పూర్తి ఉచితమని సంచలనానికి తెరదీశారు. ప్రతి ఒక్క కస్టమర్ కేవలం వాయిస్ లేదా డేటాకు మాత్రమే డబ్బు చెల్లించాలన్నదే తన ఉద్దేశమని చెప్పిన ఆయన, డేటా అందుబాటు ధరల్లో ఉండాలని, ధర విధానం సరళంగా ఉండాలని చెబుతూ, ప్రపంచంలోనే అతి తక్కువ ధరకు అత్యధిక డేటాను అందించేది జియో మాత్రమేనంటూ పలు రకాల ప్యాకేజీలను ప్రకటించారు. ఇందులో భాగంగా స్మాల్ (ఎస్) నుంచి ఎక్స్ ట్రా లార్జ్ (ట్రిపుల్ ఎక్స్ ఎల్) వరకూ ఏడు రకాల డేటా ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చినట్టు చెప్పారు. వాటి వివరాలు ఇవి... (ఈ ప్యాకేజీలన్నీ నాలుగు వారాలకు... అంటే 28 రోజుల వ్యవధికి చెల్లుబాటవుతాయి) ఎస్ ప్యాకేజీ: టారిఫ్ రూ. 149. లోకల్, ఎస్టీడీ వాయిస్ కాల్స్ ఉచితం. 0.3 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్ లను పంపుకోవచ్చు. జియో నెట్ వర్క్ అందించే వైఫై టవర్ల నుంచి సిగ్నల్స్ ఈ ప్యాకేజీకి వర్తించవు. రూ. 1,250 విలువగల జియో యాప్స్ సబ్ స్క్రిప్షన్ ఉచితం. ఎం (1) ప్యాకేజీ: టారిఫ్ రూ. 499. లోకల్, ఎస్టీడీ వాయిస్ కాల్స్ ఉచితం. 4 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. రాత్రిపూట అపరిమిత 4జీ డేటా ఉచితం. రోజుకు ఎన్ని ఉచిత ఎస్ఎంఎస్ లను అయినా పంపుకోవచ్చు. జియో నెట్ వర్క్ అందించే వైఫై టవర్ల నుంచి 8 జీబీ సిగ్నల్స్ వాడుకోవచ్చు. రూ. 1,250 విలువగల జియో యాప్స్ సబ్ స్క్రిప్షన్ ఉచితం. ఎం (2) ప్యాకేజీ: టారిఫ్ రూ. 999. లోకల్, ఎస్టీడీ వాయిస్ కాల్స్ ఉచితం. 10 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. రాత్రిపూట అపరిమిత 4జీ డేటా ఉచితం. రోజుకు ఎన్ని ఉచిత ఎస్ఎంఎస్ లను అయినా పంపుకోవచ్చు. జియో నెట్ వర్క్ అందించే వైఫై టవర్ల నుంచి 20 జీబీ సిగ్నల్స్ వాడుకోవచ్చు. రూ. 1,250 విలువగల జియో యాప్స్ సబ్ స్క్రిప్షన్ ఉచితం. ఎల్ ప్యాకేజీ: టారిఫ్ రూ. 1499. లోకల్, ఎస్టీడీ వాయిస్ కాల్స్ ఉచితం. 20 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. రాత్రిపూట అపరిమిత 4జీ డేటా ఉచితం. రోజుకు ఎన్ని ఉచిత ఎస్ఎంఎస్ లను అయినా పంపుకోవచ్చు. జియో నెట్ వర్క్ అందించే వైఫై టవర్ల నుంచి 40 జీబీ సిగ్నల్స్ వాడుకోవచ్చు. రూ. 1,250 విలువగల జియో యాప్స్ సబ్ స్క్రిప్షన్ ఉచితం. ఎక్స్ ఎల్ ప్యాకేజీ: టారిఫ్ రూ. 2499. లోకల్, ఎస్టీడీ వాయిస్ కాల్స్ ఉచితం. 35 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. రాత్రిపూట అపరిమిత 4జీ డేటా ఉచితం. రోజుకు ఎన్ని ఉచిత ఎస్ఎంఎస్ లను అయినా పంపుకోవచ్చు. జియో నెట్ వర్క్ అందించే వైఫై టవర్ల నుంచి 70 జీబీ సిగ్నల్స్ వాడుకోవచ్చు. రూ. 1,250 విలువగల జియో యాప్స్ సబ్ స్క్రిప్షన్ ఉచితం. ఎక్స్ ఎక్స్ ఎల్ ప్యాకేజీ: టారిఫ్ రూ. 3499. లోకల్, ఎస్టీడీ వాయిస్ కాల్స్ ఉచితం. 60 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. రాత్రిపూట అపరిమిత 4జీ డేటా ఉచితం. రోజుకు ఎన్ని ఉచిత ఎస్ఎంఎస్ లను అయినా పంపుకోవచ్చు. జియో నెట్ వర్క్ అందించే వైఫై టవర్ల నుంచి 120 జీబీ సిగ్నల్స్ వాడుకోవచ్చు. రూ. 1,250 విలువగల జియో యాప్స్ సబ్ స్క్రిప్షన్ ఉచితం. ట్రిపుల్ ఎక్స్ ఎల్ ప్యాకేజీ: టారిఫ్ రూ. 4499. లోకల్, ఎస్టీడీ వాయిస్ కాల్స్ ఉచితం. 75 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. రాత్రిపూట అపరిమిత 4జీ డేటా ఉచితం. రోజుకు ఎన్ని ఉచిత ఎస్ఎంఎస్ లను అయినా పంపుకోవచ్చు. జియో నెట్ వర్క్ అందించే వైఫై టవర్ల నుంచి 150 జీబీ సిగ్నల్స్ వాడుకోవచ్చు. రూ. 1,250 విలువగల జియో యాప్స్ సబ్ స్క్రిప్షన్ ఉచితం. ఈ ప్యాకేజీల్లో భాగంగా జియో ప్రీమియం యాప్స్ అయిన జియో ప్లే, జియో ఆన్ డిమాండ్, జియో బీట్స్, జియో మ్యాగ్స్, జియో ఎక్స్ ప్రెస్ న్యూస్, జియో డ్రైవ్, జియో సెక్యూరిటీ, జియో మనీ వంటివాటిని డిసెంబర్ 31 2017 వరకూ ఉచితంగా వాడుకోవచ్చు. డేటా ప్యాక్ ల విషయంలో మాత్రం ఈ సంవత్సరం డిసెంబర్ 31 తరువాత తమ టారిఫ్ ప్లాన్ ను కస్టమర్లు ఎంచుకోవాల్సి ఉంటుంది.

  • Loading...

More Telugu News