: యువత కోసం యువత తయారుచేసిన జియో.. 24 ఏళ్ల ఆకాష్, ఈషాల ఆలోచనే ఈ ప్యాకేజీ: ముఖేష్ అంబానీ
రిలయన్స్ జియోలో డైరెక్టర్లుగా ఉన్న తన కుమారుడు ఆకాష్, కుమార్తె ఈషాల మనసులో నుంచి వచ్చిన ఆలోచనలు, డేటా వాడకం దిశగా ఏ మేరకు భారత యువత డబ్బు వెచ్చిస్తుంది? ఎంత డేటా నెలకు సరాసరిన అవసరం అన్న విషయాలను పరిగణనలోకి తీసుకుని జియో డేటా ప్లాన్ లను తయారు చేసినట్టు ముఖేష్ అంబానీ వివరించారు. ఇండియాలో స్మార్ట్ ఫోన్ యూజర్ల సరాసరి వయసుకు దగ్గరగా ఉన్న 24 ఏళ్ల ఆకాష్, ఈషాలు యువతరానికి ప్రతినిధులని తాను నమ్ముతున్నట్టు షేర్ హోల్డర్ల హర్షధ్వానాల మధ్య ముఖేష్ ప్రకటించారు. యువత కోసం యువత తయారు చేసిన ఈ డేటా ప్యాక్ లు అందరినీ ఆకర్షిస్తాయని భావిస్తున్నట్టు తెలిపారు. ఇండియాలో ఇకపై 'గాంధీగిరి' స్థానంలో 'డేటా గిరి' వస్తుందని, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న డేటా చార్జీలతో పోలిస్తే 10 శాతం చార్జీతోనే తాము డేటాను అందిస్తామని తెలిపారు. జియోను వాడేవారిలో అత్యధికులు 30 శాతం కన్నా తక్కువ వయసున్నవారే ఉంటారని అన్నారు. ఇప్పుడున్న ఆపరేటర్లు మార్కెట్ ను మిస్ యూజ్ చేస్తున్నారని, కొత్తగా రంగంలోకి ప్రవేశించాలని భావించే సంస్థలకు అడ్డు తగలాలని ప్రయత్నిస్తున్నారని ముఖేష్ అంబానీ ఆరోపించారు.