: అమరావతి నివాసయోగ్యం కాదు!...గ్రీన్ ట్రైబ్యూనల్ లో మరో పిటిషన్!


నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అమరావతి నిర్మాణం కారణంగా గ్రీన్ కారిడార్ కు పెను ముప్పు తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తూ ఇప్పటికే పలు పిటిషన్లు గ్రీన్ ట్రైబ్యూనల్ లో దాఖలైన విషయం తెలిసిందే. అయితే ఈ పిటిషన్లన్నింటినీ చంద్రబాబు సర్కారు ట్రైబ్యూనల్ లో సమర్థంగా తిప్పికొట్టింది. కృష్ణా పరీవాహక ప్రాంతంలో నిర్మిస్తున్న అమరావతి నివాస యోగ్యం కాదంటూ తాజాగా మరో పిటిషన్ దాఖలైంది. వరద ముప్పు పొంచి ఉన్న ప్రాంతంలో రాజధానిని ఎలా నిర్మిస్తారంటూ దాఖలైన ఈ పిటిషన్ పై నిన్న ట్రైబ్యూనల్ సుదీర్ఘ వాదనలను విన్నది. ఈ విచారణకు ప్రముఖ పర్యావరణవేత్త మేధా పట్కార్ కూడా హాజరయ్యారు. పిటిషనర్ల వాదనలు విన్న ట్రైబ్యూనల్ మరిన్ని వివరాలతో అనుబంధ పిటిషన్ ను దాఖలు చేయాలని సూచిస్తూ తదుపరి విచారణను ఈ నెల 9కి వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News