: ఆడియో టేపులు సాక్ష్యాలుగా నిలుస్తాయా?... ‘ఓటుకు నోటు’పై రావెల వ్యాఖ్యలు!


అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా నిన్న మడకశిరలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఓటుకు నోటు కేసు విచారణపై టీడీపీ సీనియర్ నేత, ఏపీ మంత్రి రావెల కిశోర్ బాబు చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఏ కేసులోనైనా ఆడియో టేపులు సాక్ష్యాలుగా నిలిచాయా? అని రావెల వ్యాఖ్యానించారు. ఆడియో టేపులతో పాటు వీడియో, స్టింగ్ ఆపరేషన్లను కోర్టులు సాక్ష్యాలుగా పరిగణించవని సాక్షాత్తు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పేర్కొన్నదని ఆయన తెలిపారు. తప్పుడు కేసులు బనాయించడం వల్ల తమకేమీ ఇబ్బంది లేదని కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ అధినేత, సీఎం నారా చంద్రబాబునాయుడు, ప్రభుత్వ విశ్వసనీయతను దెబ్బతీసేందుకే తెలంగాణ సర్కారు, వైసీపీ యత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా వాటిని దీటుగానే ఎదుర్కొని ముందుకు సాగుతామని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News