: ఇక కడప జిల్లా వంతు!... ఎండిన పంటల పరిశీలనకు నేడు కడపకు చంద్రబాబు!


రాయలసీమలో చేతికొస్తున్న పంటలు నీటి తడులు లేక ఎండిపోతున్న వైనం ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిని తీవ్రంగా కలచివేసింది. నాలుగు రోజులుగా ఆయన సీమ జిల్లాల్లోనే పర్యటిస్తున్నారు. తొలుత అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్లిన చంద్రబాబు అదే రోజు తన సొంత జిల్లా చిత్తూరులోనూ పర్యటించారు. రెండు జిల్లాల్లో ఎండిపోతున్న వేరుశనగ పంటను పరిశీలించిన చంద్రబాబు... ఆ పంటలను కాపాడేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు ప్రారంభించారు. నాలుగు రోజుల పాటు ఆ రెండు జిల్లాల్లోనే పర్యటించిన చంద్రబాబు అధికార యంత్రాంగాన్ని కూడా ఆ జిల్లాల్లో మోహరింపజేశారు. తాజాగా నేడు కడప జిల్లాలో బీడువారిన పంటల పరిశీలన కోసం చంద్రబాబు వెళుతున్నారు. నిన్న రాత్రికి విజయవాడ చేరుకున్న చంద్రబాబు నేడు కడప జిల్లాకు వెళుతున్నారు. కడప జిల్లాలోని రాయచోటి మండలం మాధవరంలో ఎండుతున్న వేరుశనగ పంటలను చంద్రబాబు పరిశీలించనున్నారు.

  • Loading...

More Telugu News