: నయీమ్ కేసును సీబీఐకి అప్పగించాలి!... మోదీ అభిమాన సంఘం అధ్యక్షుడి డిమాండ్!


తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసుల తూటాలకు హతమైన గ్యాంగ్ స్టర్ నయీమ్ కు చెందిన వ్యవహారంపై నిజాలు నిగ్గు తేలాలంటే... సీబీఐని రంగంలోకి దింపాల్సిందేనట. సీబీఐ దర్యాప్తు చేస్తేనే కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ తో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన అధికారులతో పాటు రాజకీయ నాయకుల అసలు స్వరూపం బయటపడుతుందట. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అభిమాన సంఘం అధ్యక్షుడు తిప్పినేని రామదాసప్ప కొత్త డిమాండ్ ను వినిపించారు. ఈ మేరకు నిన్న ఢిల్లీలో ఆయన ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. నయీమ్ నేరాలను వెలికితీయడానికి తెలంగాణ సర్కారు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసిందని చెప్పిన ఆయన... సిట్ దర్యాప్తుతో నయీమ్ చీకటి దందా మొత్తం వెలుగుచూసే అవకాశం లేదన్నారు. ఈ కారణంగా నయీమ్ వ్యవహారాల గుట్టు విప్పేందుకు సీబీఐని రంగంలోకి దించాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News