: ఈ పిల్లాడికి ఐదేళ్లే... అయితే 'మనసు' మాత్రం పెద్దది!


అమెరికాలోని న్యూజెర్సీలో ఇప్పుడు విలియమ్ ఎవర్ట్స్ (5) గురించి చర్చించుకుంటున్నారు. ఐదేళ్ల ఎవర్ట్స్ చేసిన గొప్ప పని ఏంటంటే...ఇంట్లో తల్లిదండ్రులు పాకెట్ మనీగా ఇచ్చిన డబ్బును ఖర్చు చేయకుండా పొదుపు చేయడం. ఇలా పొదుపు చేసిన డబ్బుతో అర్హులైన పేద పిల్లలకు పుస్తకాలు, దుస్తులు, ఇతర సామగ్రి కొనిస్తుంటాడు. తాజాగా ఎవరూ చేయని గొప్ప పనిని ఎవర్ట్స్ చేశాడు. ఇలా తను పొదుపు చేసిన డబ్బుతో స్థానిక పోలీసు స్టేషన్ లో పోలీసులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశాడు. దీంతో స్టేషన్ లోని పోలీసు అధికారులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఐదేళ్ల పిల్లాడు తమ పనితనం గుర్తించడంతో వారంతా ఉప్పొంగిపోయారు. దీంతో వారంతా ఎవర్ట్స్ ను కొనియాడుతున్నారు. ఐదేళ్ల వయసులోనే నిస్వార్థంగా అడుగులు వేస్తున్న విలియంది అరుదైన మనస్తత్వం అని వారు చెబుతున్నారు. ఎవర్ట్స్ సమాజంలోని మిగిలిన పిల్లలందరికీ ఆదర్శనీయుడని కొనియాడుతున్నారు. అన్నిటికంటే ఇలాంటి పిల్లాడ్ని కన్న తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులని వారు అభినందించారు. చిన్న వయసులోనే విలియమ్ ఎవర్ట్స్ 'శ్రీమంతుడ'నిపించుకుంటున్నాడు.

  • Loading...

More Telugu News