: బీజేపీపై మళ్లీ నోరు పారేసుకున్న కన్నడ నటి రమ్య!
నిత్యమూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్య చేసి మీడియా నోళ్లల్లో నానుతూ, సామాజిక మాధ్యమాల్లో విమర్శలు ఎదుర్కొంటున్న కన్నడ నటి, కాంగ్రెస్ మాజీ ఎంపీ రమ్య, మరోసారి బీజేపీపై నోరు పారేసుకుంది. ఇండియా స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న సమయంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎక్కడున్నాయని ఆమె వివాదాస్పద వ్యాఖ్య చేసింది. కాంగ్రెస్ నేతలు త్యాగాలు చేస్తున్న వేళ, బీజేపీ ఏమైపోయిందని, వీధుల్లో పోరాటాలతో స్వాతంత్ర్యం కోసం కాంగ్రెస్ శ్రమిస్తున్న వేళ, బ్రిటీష్ వారితో చేతులు కలిపారని ఆమె ఆరోపించారు. అలాంటి వాళ్ల దగ్గర దేశభక్తి పాఠాలు తనకు అవసరం లేదని అన్నారు. ఇటీవల పాకిస్థాన్ లో పర్యటించి వచ్చి, ఆపై ఆ దేశానికి అనుకూల వ్యాఖ్యలు చేసి నెటిజన్ల కోపాగ్నికి గురైన ఆమెపై ఈ దఫా ఎలాంటి విమర్శలు వస్తాయో!