: రూ. లక్ష కోట్లు కట్టండి... యాపిల్ కు యూరోపియన్ యూనియన్ ఆదేశం


ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా ఉన్న యాపిల్ ఐఎన్సీ రూ. లక్ష కోట్లు (1,300 కోట్ల యూరోలు) కట్టాలని యూరోపియన్ యూనియన్ నోటీసులను పంపింది. యాపిల్ చట్టవిరుద్ధంగా ప్రభుత్వాలకు చెల్లించాల్సిన పన్నులన్నింటినీ ఎగవేసిందని ఆరోపించింది. 2008 నుంచి ఐర్లాండ్ లోని కార్క్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు మొదలు పెట్టిన యాపిల్, దాదాపు 5 వేల మంది ఉద్యోగులతో అన్ని ఇంటర్నేషనల్ లావాదేవీలనూ ఇక్కడి నుంచే చేస్తోంది. అయితే, ఈ కేంద్రం కేవలం కాగితాలకు మాత్రమే పరిమితమని, వందల కోట్ల రూపాయల డీల్స్ చేస్తూ, వాటికి సంబంధించిన ఒక్క రూపాయి పన్ను కూడా కట్టలేదని తమ విచారణలో వెల్లడైందని ఈయూ తెలిపింది. దాదాపు మూడు సంవత్సరాల పాటు ఐర్లాండ్ లోని యాపిల్ కార్యకలాపాలపై దర్యాఫ్తు జరిపి ఈ పన్ను నోటీసులను పంపింది. కాగా, ఈ నోటీసులను తాము వ్యతిరేకిస్తున్నామని యాపిల్ పేర్కొంది. అమెరికా ప్రభుత్వం సైతం ఈయూ నోటీసులపై అపీలు చేస్తామని వెల్లడించింది. సానుకూలంగా ఉన్న పన్ను షరతులను ఆశగా చూపిన ఐర్లండ్ ప్రభుత్వం, యాపిల్ ను తమ దేశానికి తీసుకు వెళ్లిందని, ఇప్పుడు పన్నులు కట్టాలని నోటీసులేంటని ప్రశ్నించింది.

  • Loading...

More Telugu News