: బంజారాహిల్స్‌లో ప్రమాదానికి గురైన ఎమ్మెల్యే బాలకృష్ట కారు... తప్పిన ప్రమాదం


ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కారు హైదరాబాదు, బంజారాహిల్స్‌లోని బసవ తారకం క్యాన్సర్ ఆస్పత్రి దగ్గర ప్రమాదానికి గురైంది. మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పి కరెంటు స్తంభాన్ని ఢీకొని ఆపై డివైడర్‌ను ఢీకొని ఆగిపోయింది. కారు ప్రమాదానికి గురైన వెంటనే ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో డ్రైవర్‌కు ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో బాలకృష్ణ కారులో లేరని తెలియడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

  • Loading...

More Telugu News