: గవర్నర్ ను కలిసిన సీఎం కేసీఆర్, ఏసీబీ డీజీ
తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను తెలంగాణ సీఎం కేసీఆర్ కలిశారు. సుమారు రెండు గంటలపాటు వారు చర్చించినట్లు సమాచారం. సీఎం అక్కడ ఉన్న సమయంలోనే ఏసీబీ డీజీ ఏకే ఖాన్, తెలంగాణ అడ్వకేట్ జనరల్ కూడా గవర్నర్ ను కలిశారు. కాగా, ఓటుకు నోటు కేసుకు సంబంధించి వారు చర్చించినట్లు సమాచారం.