: తెలంగాణ ప్రభుత్వం కారణంగానే మీడియాలో నా వార్తలు తగ్గుతున్నాయి: రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం కారణంగానే తన వార్తలు మీడియాలో తగ్గిపోతున్నాయని, తన వార్తలకు ఎక్కువ ప్రచారం లేకుండా చేయాలని ప్రభుత్వం చూస్తోందని టీటీడీపీ వర్కింగ్ ప్రెసెడెంట్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈరోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ, తనను తిట్టినవారికి ఉద్యోగాలొస్తున్నాయని, పాతూరి సుధాకర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డికి ప్రమోషన్లు కూడా లభించాయని విమర్శించారు. మరో వ్యక్తికి ఇటీవల పీఆర్వోగా ఉద్యోగం కూడా వచ్చిందన్నారు.