: సమంతను స్వయంగా సచిన్ టెండూల్కర్ కు పరిచయం చేసిన నాగార్జున!
అక్కినేని నాగచైతన్య, సమంతల వివాహం ఖరారైపోయినట్టేనని చెప్పేందుకు ఇది మరో ఉదాహరణ. ఓ వివాహ వేడుకకు వచ్చిన లెజండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ దంపతులకు, నాగార్జున స్వయంగా సమంతను పరిచయం చేశారు. సచిన్ కు మాత్రమే కాదు, ఆ ఫంక్షన్ కు వచ్చిన పలువురు అతిథులకు కూడా ఆమెను తనకు కాబోయే పెద్ద కోడలిగా పరిచయం చేసినట్టు తెలుస్తోంది. ఇక సచిన్ దంపతులకు నాగచైతన్య పక్కనున్న సమంతను పరిచయం చేస్తున్న నాగార్జున చిత్రాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దీన్ని చూసిన వారంతా, "ఇక దాచేదేమీ లేదు. వ్యవహారమంతా బయటికి వచ్చేసింది. త్వరలోనే పెళ్లి బాజాలు మోగడం ఖాయం" అంటున్నారు.