: జంపింగ్ కు వేళాయె... చంద్రబాబు నివాసానికి దేవినేని నెహ్రూ, అవినాష్


కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ తెలుగుదేశం పార్టీలో చేరికకు సమయమొచ్చేసింది. గత కొన్ని రోజులుగా నెహ్రూ చేరికపై వార్తలు వస్తుండగా, ఈ ఉదయం కళా వెంకట్రావుతో కలసి దేవినేని నెహ్రూ, అవినాష్ లు ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వచ్చి చర్చలు జరిపారు. తెలుగుదేశం పార్టీలోకి దేవినేని వచ్చేందుకు రెండు రోజుల క్రితం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, ఆపై తన అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశమైన ఆయన కాంగ్రెస్ ను వీడేందుకే నిర్ణయించుకున్నారు. విజయవాడ రాజకీయాల్లో ప్రధాన నేతలైన వల్లభనేని వంశీ, దేవినేని ఉమ, దేవినేని నెహ్రూ వంటి వారంతా ఇక ఒకే పార్టీలో ఉండటంతో వీరి మధ్య సయోధ్య ఏ మేరకు ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

  • Loading...

More Telugu News