: హైదరాబాద్ శివారు మునగనూరులో డ్రైవర్ దారుణహత్య
హైదరాబాద్ శివారు హయత్ నగర్ మండలం మునగనూరు గ్రామంలో డీసీఎం డ్రైవర్ వెంకటేశ్ (40) దారుణ హత్యకు గురయ్యాడు. ఈరోజు సాయంత్రం నడిరోడ్డుపైనే జరిగిన ఈ హత్యకు సంబంధించిన వివరాలను స్థానికులు, పోలీసులు తెలిపారు. సాయంత్రం 6 గంటల సమయంలో వెంకటేశ్ తన ద్విచక్రవాహనంపై హయత్ నగర్ కు వెళ్తున్నాడు. గుర్తుతెలియని వ్యక్తులు ముగ్గురు అతన్ని ఆపి గొడవకు దిగారు. తమ వెంట తెచ్చుకున్న మారణాయుధాలతో వారు అతనిపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ అతను అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అనంతరం, గుర్తుతెలియని వ్యక్తులు ముగ్గురు తమ బైక్ పై పారిపోయారని సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఐ నరేందర్ గౌడ్ తెలిపారు.