: ట్వీట్ తో కాకపుట్టిస్తున్న సుబ్రహ్మణ్యస్వామి


బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి గత కొంత కాలంగా సైలెంట్ గా ఉన్నారని భావించే లోపల జీఎస్టీ బిల్లు వల్ల సాధారణ ప్రజానీకానికి ఒనగూరే లాభాల కంటే నష్టాలే ఎక్కువని, ప్రభుత్వాలు ప్రైవేటు యాజమాన్యాల చెప్పుచేతల్లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందనే భావంతో ట్వీట్ చేసి రెండు రోజుల క్రితం కాకపుట్టించిన సంగతి తెలిసిందే. తాజాగా సస్పెన్స్ తో కూడిన ట్వీట్ చేసి ఆయన ఆసక్తికర చర్చకు తెరతీశారు. ముడి చమురు ధరలో మీరు నిపుణులైతే... డిసెంబర్ లో పెట్రోలు ధర ఎంత ఉంటుందో ఊహించగలరా? అని ఆయన ట్వీట్ చేశారు. ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానో రేపు సమాధానం చెబుతానని ఆయన సస్పెన్స్ రేపారు. అలాగే అంతర్జాతీయ మార్కెట్ లో బ్యారెల్ క్రూడాయిల్ ధర 60 డాలర్లను దాటితే మన ఆర్ధిక వ్యవస్థ పరిస్థితి ఎలా ఉండనుంది? అని ఆయన ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News