: ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు కరిమొవాకు అస్వస్థత
ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు ఇస్లాం కరిమొవా అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని కరిమొవా కూతురు లోలా కరిమొవా తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పేర్కొన్నారు. బ్రెయిన్ హెమరేజ్ కారణంగా తన తండ్రిని ఆసుపత్రిలో చేర్చామని, ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి గురించి ప్రస్తుతం ఇప్పుడేమీ చెప్పలేమని ఆమె పేర్కొంది.