: ప్రకాశం జిల్లాలో భూప్రకంపనలు...భయాందోళనల్లో ప్రజలు
ప్రకాశం జిల్లాలో భూప్రకంపనలు సంభవించాయి. ఒంగోలు, చుట్టుపక్కల గ్రామాల్లో రెండు నుంచి మూడు సెకెన్ల పాటు భూమి కంపించింది. తొలుత కళ్లు తిరుగుతున్నాయని భావించిన స్థానికులు ఎక్కువ మంది ఇదే భావనకు గురికావడంతో ఆందోళన చెందారు. భూమి కంపిస్తోందని గుర్తించిన పలువురు ఇళ్ల నుంచి బయటకు పరుగులుతీశారు. అయితే ఈ ప్రకంపనలు భూకంపం కారణంగా వచ్చినవా? లేక క్వారీలలో చేపట్టిన పేలుళ్ల కారణంగా సంభవించినవా? అన్నది నిగ్గుతేల్చాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఏడాదిలో సుమారు నాలుగు సార్లు ఇలా జరుగుతోందని, దీనికి కారణాలు వెల్లడించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.