: బంగ్లాదేశ్ లో భద్రతపై భరోసా ఉంటేనే పర్యటించండి: ఇంగ్లండ్ కు బంగ్లా మాజీ కోచ్ సలహా
బంగ్లాదేశ్ లో ఇంగ్లండ్ పర్యటించడంపై బంగ్లా జట్టు మాజీ కోచ్ మాల్ లోయ్ హెచ్చరికలు జారీ చేశాడు. బంగ్లాదేశ్ లో భయపడాల్సిన అవసరం లేదని చెబుతూనే, అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు. బంగ్లాదేశ్ పర్యటనలో ఇంగ్లండ్ ఆటగాళ్ల భద్రతపై పూర్తిగా స్పష్టత వచ్చిన తరువాతే పర్యటనకు వెళ్లాలని సూచించాడు. ఈ మధ్య కాలంలో ఆ దేశంలో చోటుచేసుకుంటున్న ఉగ్రదాడులను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించాడు. ఈ దాడుల కారణంగానే ఆందోళనకు గురై తాను కోచ్ పదవికి గుడ్ బై చెప్పానని ఆయన వెల్లడించారు. గత ఏడాది ఆస్ట్రేలియా క్రికెట్ జట్టును ఉగ్రవాదులు టార్గెట్ చేశారంటూ వచ్చిన వార్తలకు ఈమధ్య కాలంలో అక్కడ జరుగుతున్న బాంబు దాడులు మరింత బలాన్నిస్తున్నాయని ఆయన పేర్కొన్నాడు.