: విశాఖలో మిగ్ విమానం ఆయిల్ ట్యాంక్ ఊడిపడింది!


మిగ్ విమానం అదనపు ఆయిల్ ట్యాంక్ ఒకటి ఊడిపడిపోయిన సంఘటన విశాఖపట్టణంలో జరిగింది. మల్కాపురం సీఐఎస్ఎఫ్ సిబ్బంది నివాసాల సముదాయం ఆవరణలో ఈ విమానం ఆయిల్ ట్యాంక్ పడిపోయింది. అయితే, ట్యాంక్ లోని ఇంధనం అంతా బయటికి వచ్చినప్పటికీ మంటలు చెలరేగలేదు. సాంకేతిక సమస్యల వల్లనే ఈ సంఘటన జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు, నౌకాదళ సిబ్బంది దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఈ విమానం ఐఎన్ఎస్ డేగ వద్ద క్షేమంగా ల్యాండ్ అయినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News