: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి గంటా


తమ అధినేత చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వం అంటే ఎంత మాత్రమూ భయపడే రకం కాదని, రాష్ట్రాభివృద్ధి, ప్రత్యేక హోదా సాధనకు నిత్యం శ్రమిస్తున్నారని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం వెలగపూడిలో తన కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీబీఐ కేసులకు భయపడబోనని చెబుతున్న చంద్రబాబు, కేంద్రంపై ఎందుకు పోరాడటం లేదని చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. కేంద్రమంటే భయపడటానికి చంద్రబాబేమీ తప్పులు చేయలేదని, ఇప్పటికే ఎన్నోసార్లు ఢిల్లీ వెళ్లి హోదా కోసం చర్చలు జరిపారని గుర్తు చేశారు. రాష్ట్రం ఆర్థిక కష్టాల్లో ఉందని, అనేక సమస్యల నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్నామని, ఈ సమయంలో రాజకీయ సంక్షోభాలు వద్దన్న కారణంతోనే కొంత ఆగాల్సి వస్తోందని గంటా వివరించారు. ప్రతిపక్ష నాయకులు సహకరించకుండా అడుగడుగునా రాజకీయ ప్రయోజనాల కోసమే విమర్శలు చేస్తున్నారని, వారిలా కాకుండా హోదా సాధనకు ఏం చేయాలన్న విషయాన్ని పవన్ నిర్మాణాత్మకంగా చెబితే ఆ దారిలో నడిచేందుకు అభ్యంతరం లేదని అన్నారు.

  • Loading...

More Telugu News