: నయీమ్ ఇంటిలో రూ.2 కోట్ల విలువ చేసే చీరలు!... స్వాధీనం చేసుకున్న సిట్!


తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసుల చేతిలో హతమైన గ్యాంగ్ స్టర్ నయీమ్ కు సంబంధించి రోజుకో ఆసక్తికర అంశం వెలుగు చూస్తోంది. ఇప్పటికే హైదరాబాదులోని పలు ప్రాంతాల్లో ఉన్న అతడి ఇళ్లు, బంధువుల ఇళ్లలో పెద్ద ఎత్తున కరెన్సీ కట్టలు, నగలు, మారణాయుధాలు లభించిన సంగతి తెలిసిందే. తాజాగా నగరంలోని పుప్పాలగూడలోని నయీమ్ ఇంటిలో సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో దాదాపు రూ.2 కోట్ల విలువ చేసే చీరలు వెలుగుచూశాయి. ఈ ఏడాది వినాయక చవితి సందర్భంగా మహిళలకు పంచేందుకే నయీమ్ ఈ చీరలను కొనుగోలు చేసినట్లు సిట్ అధికారులు భావిస్తున్నారు. తనపై పడిన చెడ్డ పేరును చెరిపేసుకునేందుకు నయీమ్ పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడని, అందులో భాగంగానే ఈ చీరల పంపిణీకి ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. అయితే కొనుగోలు చేసిన చీరలను పంపిణీ చేయకముందే అతడు హతమైపోయాడు.

  • Loading...

More Telugu News