: లాస్ ఏంజిల్స్ విమానాశ్రయంలో ఎలాంటి కాల్పులు జరగలేదని తేల్చిన పోలీసులు!
అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో కాల్పులు కలకలం చెలరేగినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. విమానాశ్రయాన్ని పాక్షికంగా మూసివేసిన అధికారులు ఘటనపై ఆరా తీశారు. ఎయిర్ పోర్టులో విస్తృత తనిఖీలు చేశారు. అనంతరం అక్కడి పోలీసులు మీడియాకు పలు వివరాలు వెల్లడించారు. కాల్పులు జరిగినట్లు వస్తోన్న వార్తలను ఖండించారు. విమానాశ్రయంలో వచ్చిన పలు శబ్దాల వల్లే కాల్పులు జరిగినట్లు పుకార్లు వ్యాపించాయని, నిజానికి విమానాశ్రయంలో కాల్పులు జరగలేదని స్పష్టం చేశారు.