: కృష్ణాష్టమి వేడుకల్లో దారుణం!... ‘అనంత’లో డ్యాన్సర్ పై గ్యాంగ్ రేప్!
గత వారం జరిగిన కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా అనంతపురం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కృష్ణాష్టమి వేడుకల రోజునే జరిగిన ఈ దారుణం కాస్తంత ఆలస్యంగా వెలుగుచూసింది. వేడుకల్లో భాగంగా ప్రదర్శన ఇచ్చేందుకు వచ్చిన ఓ డ్యాన్సర్ పై సామూహిక అత్యాచారం జరిగింది. జిల్లాలోని నార్పలలో చోటుచేసుకున్న ఈ ఘటనలో అత్యాచారానికి గురైన బాధిత డ్యాన్సర్ తొలుత భయంతో నోరు విప్పకున్నా... ఆ తర్వాత ధైర్యం చేసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. డ్యాన్స్ చేసేందుకు వచ్చిన తనపై నలుగురు యువకులు దాడి చేయడమే కాకుండా సామూహికంగా అత్యాచారం చేశారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన నార్పల పోలీసులు నిందితుల కోసం గాలింపు మొదలుపెట్టారు.