: వైఎస్ రాజశేఖరరెడ్డి కొడుకు సీఎం అవుతాడంటే ఆనందిస్తాం: ఉండవల్లి అరుణ్ కుమార్
వైఎస్ రాజశేఖరరెడ్డి కొడుకు సీఎం అవుతాడంటే సంతోషిస్తానని సీనియర్ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, వైఎస్ రాజశేఖర రెడ్డితో తనకు చాలా సాన్నిహిత్యం ఉండేదని, కనుక వైఎస్ కొడుకు జగన్ పై మాకు అభిమానం ఉండటం సహజమని అన్నారు. మా కళ్ల ముందు తిరిగిన కుర్రాడు, వైఎస్ కొడుకు సీఎం అవుతాడంటే ఆనందిస్తామన్నారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడితో తమకెప్పుడూ స్నేహ సంబంధాలు లేవని, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా పెద్ద పరిచయం లేదని అన్నారు. వైఎస్ జగన్ కు మేధోపరమైన సలహాలిచ్చేంత మేధస్సు తన వద్ద లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.