: మూర్ఖపు ప్రభుత్వాలు మాట వినకపోతే పవన్ మమ్మల్ని నిందిస్తారా?: జేసీ దివాకర్ రెడ్డి
ఏపీకి ప్రత్యేకహోదా విషయమై మూర్ఖపు ప్రభుత్వాలు మాట వినకపోతే పవన్ మమ్మల్ని నిందిస్తారా? అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై జేసీ దివాకర్ రెడ్డి మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన విషయమై ఎలా చేయాలో పవన్ చెప్తే, టీడీపీ అలా చేస్తుందన్నారు. పవన్ కు వయసు తక్కువ, అనుభవం తక్కువ అని, పవన్ ప్రాక్టికల్ గా మాట్లాడాలని, ఇది సినిమా కాదని అన్నారు. అంతేకానీ, ప్రత్యేక హోదా రాలేదంటూ ప్రజాప్రతినిధులపై నిందలు వేయొద్దని అన్నారు. బీజేపీతో ఉంటే టీడీపీ కూడా మునిగిపోతుందని జేసీ ఘాటుగా వ్యాఖ్యానించారు.