: ఫామ్ హౌస్ నుంచి నిజామాబాదు జిల్లా పర్యటనకు బయలుదేరిన కేసీఆర్!
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొద్దిసేపటి క్రితం మెదక్ జిల్లా జగదేవపూర్ మండలం ఎర్రవలిలోని తన సొంత వ్యవసాయ క్షేత్రం (ఫామ్ హౌస్) నుంచి బయటకు వచ్చారు. ఇటీవల వారాంతాల్లో ఫామ్ హౌస్ కు వస్తున్న క్రమంలో నిన్న రాత్రి కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. నేటి షెడ్యూల్ ప్రకారం నిజామాబాదు జిల్లా పర్యటనకు వెళ్లాల్సి ఉండటంతో కొద్దిసేపటి క్రితం ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన ఆయన నిజామాబాదుకు బయలుదేరారు.