: బెజవాడలో మాజీ ప్రధాని!... కనకదుర్గమ్మ సేవలో హెచ్ డీ దేవేగౌడ!
భారత మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడ నిన్న సాయంత్రానికి ఏపీ పొలిటికల్ కేపిటల్ విజయవాడ చేరుకున్నారు. నిన్న రాత్రి అక్కడే బస చేసిన ఆయన నేటి ఉదయం ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం లభించింది. ఆ తర్వాత అమ్మవారికి దేవేగౌడ ప్రత్యేక పూజలు చేశారు. కేవలం అమ్మవారిని దర్శించుకునేందుకే దేవేగౌడ విజయవాడ వచ్చారా? లేక ఇంకేదైనా కార్యక్రమం నిమిత్తం బెజవాడ వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారా? అన్న విషయం తెలియరాలేదు.