: నాలుగు కార్లు, మూడు రంగులు!... ఒలింపిక్ స్టార్లలో ఎవరికి ఏ రంగు కారంటే!


ముగ్గురు ఒలింపిక్ స్టార్లు పీవీ సింధు, సాక్షి మాలిక్, దీపా కర్మాకర్, భారత బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ కు నాలుగు బీఎండబ్ల్యూ కార్లను ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అందజేశారు. హైదరాబాదులోని పుల్లెల గోపీచంద అకాడెమీ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో నలుగురికి ఆయన కార్లను అందజేశారు. ఈ నలుగురి కోసం సేకరించిన నాలుగు కార్లు మూడు రంగుల్లో ఉన్నాయి. పీవీ సింధుకు ఎరుపు రంగు, సాక్షి మాలిక్ కు బ్లూ రంగు... దీపా, గోపీచంద్ లకు తెలుపు రంగు కార్లను అందజేశారు. పీవీ సింధుకు క్రీడా ప్రముఖుడు చాముండేశ్వరినాథ్ కారును గిఫ్ట్ గా ఇవ్వగా, పుల్లెల గోపీచంద్ కు ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కారును ఇచ్చారు. ఇక సాక్షి, దీపాలకు పలువురు ప్రముఖులు ఈ కార్లను కొనుగోలు చేసినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News