: పోలో మంటూ పవన్ కల్యాణ్ ను విమర్శించడానికి రాకండి!: సినీ నటుడు శివాజీ


పవన్ కల్యాణ్ మాట్లాడాడు కనుక విమర్శిస్తే పార్టీ అధిష్ఠానం వద్ద మంచి మార్కులు కొట్టేయచ్చని అతనిని విమర్శించేందుకు పొలో మంటూ ముందుకు రావద్దని రాజకీయ నాయకులకు సీనీ నటుడు, ఏపీ ప్రత్యేకహోదా సాధన సమితి అధ్యక్షుడు శివాజీ సూచించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ రంగంలోకి దిగడంతో ఏపీకి ప్రత్యేకహోదా వచ్చితీరుతుందని అన్నారు. పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వస్తే తాము బిచాణా ఎత్తేయాలన్న సంగతి చాలా మందికి తెలుసని, అందుకే ఆయనను విమర్శించేందుకు ముందుకు వస్తారని, అలాంటి వారంతా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే... ఏపీకి ప్రత్యేకహోదా, ప్రత్యేకప్యాకేజీ సాధించగల సత్తా ఉన్న నాయకుడు పవన్ కల్యాణ్ ఒక్కరే అన్న సంగతి గుర్తుంచుకోవాలని ఆయన చెప్పారు. విమర్శలు మాని ఆయన చేస్తానన్న పనిని అభినందించాలని ఆయన సూచించారు. ఏపీకి ప్రత్యేకహోదా ఖాయమని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News