: బాబుగారూ! కేంద్రం అంటే ఎందుకు భయపడాలి? వారు కూడా మనుషులే కదా?: పవన్ కల్యాణ్


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రంతో వివాదాలు వద్దని, నిధులివ్వరని భయంగా ఉందని పదే పదే చెబుతుంటారని పవన్ కల్యాణ్ అన్నారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు గారూ...అసలు ఏ ముఖ్యమంత్రి అయినా కేంద్రం అంటే ఎందుకు భయపడాలి? అని ఆయన ప్రశ్నించారు. కేంద్రంలో ఉన్న వారు కూడా మనుషులే కదా? అని ఆయన చెప్పారు. మీరు అలా భయపడుతున్నారంటే మీకు ఏవైనా లొసులుగులు ఉన్నాయా? సీబీఐతో భయపెడతారన్న భయం ఉందా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. మీ దగ్గర ఏ లోసుగులు లేకపోతే, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని పదేపదే కించపరుస్తుంటే పోరాడడానికి మీకున్న సమస్య ఏంటి? అని ఆయన నిలదీశారు. పార్లమెంటులో మీ గొంతు వినిపించండి, పార్లమెంటును స్తంభింపచేయండి అని ఆయన సూచించారు. అలా చేయకుండా వారిదగ్గర ఎంత కాలం భయపడతారని ఆయన అడిగారు.

  • Loading...

More Telugu News