: తిరుమల నుంచి సభా ప్రాంగణానికి బయలుదేరిన పవన్ కల్యాణ్.. జనసేనాని ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి
మృతి చెందిన తన అభిమాని కుటుంబాన్ని పరామర్శించడానికి హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లిన పవన్ కల్యాణ్, గత రెండు రోజులుగా తిరుమలలోనే బసచేస్తోన్న విషయం తెలిసిందే. కొద్దిసేపటి క్రితం ఆయన తిరుపతి ఇందిరా మైదానానికి బయలుదేరారు. మరికాసేపట్లో సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. పవన్ రాక కోసం ఆయన అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. పవన్ ఏం మాట్లాడతారనే అంశంపై రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తినెలకొంది. సభా ప్రాంగణానికి ఇప్పటికే వేలాది మంది అభిమానులు చేరుకున్నారు.