: ఉత్తరప్రదేశ్ రాయ్‌బరేలీలో కర్కోటక మహిళ.. పసివాడిని దారుణంగా హింసించిన కన్నతల్లి
సహజంగా బిడ్డపై తల్లి కొండంత ప్రేమను చూపిస్తుంది. తన చిన్నారి ఎంత అల్లరి చేసినా తల్లికి ముద్దే. తన బిడ్డకు చిన్న దెబ్బతగిలినా ఎంతో అల్లాడిపోతుంది. కానీ ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో ఓ కర్కోటక మహిళ తన కన్న కొడుకుపైనే దాష్టీకాన్ని చూపింది. పసివాడిని దారుణంగా హింసించింది. ఈ దృశ్యాలు ఇంట్లో ఉన్న సీసీ టీవీకి చిక్కాయి. పసివాడన్న విచక్షణ మరిచి చిన్నారిని చావగొట్టింది ఆ మహిళ. భర్త, అత్తింటి వారిపై కోపంతోనే బిడ్డను హింసించినట్లు తెలుస్తోంది. మంచంపై కూర్చొని పసివాడి వెనుకభాగాన అదేపనిగా కొట్టింది. చిన్నారి ఎంతగా ఏడుస్తోన్నా పసివాడిపై ఆ తల్లికి ఆగ్రహం తగ్గలేదు.