: నాకొక్క అవకాశం ఇవ్వండి: మోదీతో సమావేశం అనంతరం మెహబూబా ముఫ్తీ


"కాశ్మీరులో వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్న వారికి నా విన్నపం. మీకు నాపై కోపం ఉండవచ్చు. నాకు మీపై కోపం ఉండవచ్చు. కానీ దయచేసి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి" అని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ వేర్పాటు వాదులకు, నిరసనలకు ఆజ్యం పోస్తున్న వారిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. కాశ్మీర్ లో అశాంతికి కారణం పాకిస్థాన్ మాత్రమేనని ఆరోపించిన ఆమె, కాశ్మీర్ లో పరిస్థితిని ప్రధానికి వివరించానని, ఆయన కూడా సాధారణ స్థితి నెలకొనేందుకు దృష్టిని సారిస్తానని హామీ ఇచ్చారని అన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు మరింతగా దిగజారకుండా చూస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News