: ఆదిని అందరూ తమ ‘చుట్టాలబ్బాయ్’ అంటున్నారు: సినీనటుడు సాయికుమార్
డైలాగ్ కింగ్ సాయికుమార్ తనయుడు ఆది హీరోగా, దర్శకుడు వీరభద్రమ్ తెరకెక్కించిన మూవీ 'చుట్టాలబ్బాయి' విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈరోజు సినీనటుడు సాయికుమార్ తన కుమారుడితో కలిసి ఈ సినిమాను మరోసారి చూశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సినిమా మంచి విజయం సాధించిందని అన్నారు. ఆదిని అందరూ వారి చుట్టాలబ్బాయ్ అంటున్నారని ఆయన అన్నారు. సినిమాలో ఆది మెరుగైన నటన కనబరిచాడని పేర్కొన్నారు. తనకెంతో ఆనందంగా ఉందని అన్నారు. సినిమాలో తాను కూడా ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తానని ఆయన అన్నారు.