: పెళ్లికాని జంటలకు గుడ్ న్యూస్.. ఇకనుంచి వారు కూడా 'ఓయో' రూములు బుక్‌ చేసుకోవచ్చు!


పెళ్లి కాని జంటలకు ఇది నిజంగా మంచివార్తే. ఇక నుంచి వారు కూడా 'ఓయో' రూములను బుక్ చేసుకోవచ్చని ఆ సంస్థ తెలిపింది. దేశంలోని 200 నగరాల్లో 70 వేల హోటల్ రూములను సామాన్యులకు అందుబాటు ధరల్లోకి తెచ్చిన ఓయో రూమ్స్ తాజాగా ఈ ఆఫర్‌ను ప్రకటించింది. రెండు నెలల క్రితం పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని హోటళ్లలో ఈ సౌకర్యం కల్పించిన ఓయో రూమ్స్ తాజాగా తమ పరిధిలోని 60 శాతం హోటళ్లను ఈ జాబితాలో చేర్చింది. స్థానిక గుర్తింపు పత్రాలతో వారు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని పేర్కొంది. మెట్రో సిటీలు సహా దేశవ్యాప్తంగా వంద నగరాల్లో ప్రస్తుతం ఈ సౌకర్యం అందుబాటులో ఉందని వివరించింది.

  • Loading...

More Telugu News