: ఈ చిన్నారి నన్ను వదిలిపెట్టలేదు: సన్నీలియోన్
షూటింగ్ విరామ సమయంలో ప్రముఖ బాలీవుడ్ నటి సన్నీలియోన్ కు ఎదురైన ఒక సంఘటన ఆమెను ఆశ్చర్యానికి గురిచేసింది. షూటింగ్ విరామ సమయంలో క్యూట్ గా ఉన్న ఒక చిన్నారిని సన్నీ లియోన్ ఎత్తుకుని ఆడించింది. అయితే, ఆ తర్వాత, కిందకు దిగనంటూ ఆ చిన్నారి ఆమె దగ్గరే ఉండిపోయింది. చివరకు, చిన్నారి తల్లిదండ్రులు పిలిచినా కూడా సన్నీని వదల్లేదు. ఆ మాటలు, ఈ మాటలు చెప్పి మొత్తానికి ఆ చిన్నారిని సన్నీ వద్ద నుంచి వారు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఒక వీడియోను సన్నీలియోన్ తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.