: పది టేకులైనా మహేశ్ బాబు పట్టించుకోడు... షాట్ బాగా రావడమే అతనికి ముఖ్యం!: 'అందాల రాక్షసి' ఫేమ్ రాహుల్ రవీంద్ర
సూపర్ స్టార్ మహేశ్ బాబు షాట్ సరిగ్గా వచ్చేందుకు ఎన్ని టేకులైనా తీసుకుంటారని 'అందాల రాక్షసి' ఫేమ్ రాహుల్ రవీంద్ర తెలిపాడు. 'శ్రీమంతుడు' సినిమాలో మహేశ్ బాబుతో చేస్తున్నప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నానని అన్నాడు. అంత పెద్ద నటులుగా ఎదిగినా, వారు ఓపిగ్గా నటించే విధానమే వారిని స్టార్ లను చేసిందనిపిస్తుందని చెప్పాడు. కాగా, తన మొదటి సినిమాయే తనకు పేరుతేవడం అదృష్టమని అన్నాడు. ప్రస్తుతం తాను మూడు సినిమాల్లో నటిస్తున్నానని, ఒక సినిమా షూటింగ్ పూర్తి కావస్తోందని, తరువాత 'శోభన్ బాబు' సినిమాలో నటిస్తున్నానని, ఆ సినిమాలో ముగ్గురు హీరోయన్లు ఉండడంతో దానికి 'శోభన్ బాబు' అని పేరు పెట్టారని, గతంలో 'శోభన్ బాబు' సినిమాల్లో ఇద్దరు లేదా ముగ్గురు హీరోయిన్లు ఉండేవారని గుర్తుచేశాడు. గత వారమే ఒక సినిమాకు సంతకం చేశానని, ఈ మూడు సినిమాలు తన ఫేట్ ను నిర్ణయిస్తాయని రాహుల్ వెల్లడించాడు.