: వైఎస్ రాజశేఖరరెడ్డిని అడ్డుపెట్టుకుని ఎవరికి వారు దోచుకున్నారు: చంద్రబాబు


దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిని అడ్డుపెట్టుకుని నాడు ఎవరికి కావల్సింది వారు దోచుకున్నారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర భవిష్యత్ ను తాకట్టు పెట్టిన వారికి, తనను విమర్శించే అర్హత లేదని, ప్రజాధనాన్ని లూటీ చేసిన వ్యక్తి ప్రతిపక్షనేతగా ఉండటం బాధాకరమన్నారు. మంచిపనులు చేసినంత వరకు ప్రజల మనసులో ఎప్పటికీ ఉంటారని, ప్రజాస్వామ్యం, ప్రజలపై తనకు అచంచలమైన విశ్వాసం ఉందని అన్నారు.

  • Loading...

More Telugu News