: నేపాల్లో ఘోర బస్సు ప్రమాదం.. బస్సు నదిలో పడి 20 మంది మృతి
నేపాల్లోని ఖాట్మండుకి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న చండీ బంజంగ్ వద్ద ఈరోజు ఉదయం ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఓ బస్సు అదుపుతప్పి నదిలో పడిపోవడంతో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరో 17 మందిని పోలీసులు, స్థానికులు కలిసి ఆసుపత్రికి తరలిస్తున్నారు. బస్సు 100 మీటర్ల ఎత్తులో నుంచి త్రిశోలి నదిలో అదుపుతప్పి పడిందని, స్థానికులు వెంటనే అప్రమత్తమై తమకు సమాచారం అందించి, సహాయక చర్యల్లోనూ పాల్గొన్నారని అక్కడి పోలీసులు మీడియాకు తెలిపారు.