: సోషల్ మీడియాలో మోదీ, అమితాబ్, షారూఖ్ లే బెస్టు


సోషల్ మీడియాను వినియోగించడం ప్రధాని నరేంద్ర మోదీకి తెలిసినంతగా మరెవరికీ తెలియదంటే అతిశయోక్తి కాదు. 2009లో ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేసిన నరేంద్ర మోదీ తనదైన శైలిలో ట్విట్టర్ లో దూసుకుపోతూ ఫాలోయర్లను పెంచుకుంటూ పోతున్నారు. దీంతో భారత్ లో అత్యధిక ఫాలోయర్లు కలిగిన వ్యక్తిగా మోదీ రికార్డు నెలకొల్పారు. ట్విట్టర్లో ఆయన ఫాలోయర్ల సంఖ్య నేటితో (ఆగస్టు 25వ తేదీతో) 22.1 మిలియన్లకు చేరింది. ఆ తరువాతి స్థానంలో బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్‌ నిలిచారు. ఆయనను ట్విట్టర్ లో 22 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. తరువాతి స్థానంలో బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ నిలిచారు. ఆయనను 20.9 మిలియన్ల మంది ఫాలోకావడం విశేషం. ప్రపంచ స్థాయిలో అత్యధిక ఫాలోయర్లు కలిగిన వ్యక్తిగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నిలవగా, అతని తరువాతి స్థానంలో మోదీ నిలవడం విశేషం.

  • Loading...

More Telugu News